Posts

Showing posts with the label collections

geetha govindam movie collections ‘గీత గోవిందం’ 100 కోట్ల క్లబ్‌లో విజయ్‌ దేవరకొండ రష్మిక

Image
యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఆయన నటించిన ‘గీత గోవిందం’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కేవలం 12 రోజుల్లో ఈ వసూళ్లు సాధించడం మరో విశేషం. కెరీర్‌ ప్రారంభ దశలోనే విజయ్‌ ఈ ఘనత సాధించడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలో ఈ చిత్రం 2 మిలియన్‌ క్లబ్‌లో అడుగుపెట్టింది. విజయ్‌కు బ్రేక్‌ ఇచ్చిన ‘పెళ్లి చూపులు’ అక్కడ 1.22 మిలియన్‌ డాలర్లు రాబట్టగా, ‘అర్జున్‌రెడ్డి’ 1.78 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు వీటిని ‘గీత గోవిందం’ బీట్‌ చేసింది. ఇలా విజయ్‌ ప్రతి సినిమాకు తన సత్తాను పెంచుకుంటూ పోతున్నారని విశ్లేషకులు సోషల్‌మీడియాలో మెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో రూ.100 కోట్లు వసూలు చేసిన అతి తక్కువ మంది హీరోల్లో ఇప్పుడు విజయ్‌ కూడా చేరిపోయారు. పరుశురాం ‘గీత గోవిందం’ సినిమాకు దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సుబ్బరాజు, అను ఇమ్మాన్యుయేల్‌, నిత్యా మేనన్‌, అన్నపూర్ణ, నాగబాబు, గిరిబాబు, గౌత...